ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్‌..

– ఆరు గ్యారెంటీలపై  ఫోకస్​       
– అధికారంలోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు
– పల్లెలలో విస్తృత స్థాయిలో ప్రచారం
– హస్తం పార్టీకే పట్టంకట్టాలని విజ్ఞప్తి
నవతెలంగాణ- చివ్వేంల: బీఆర్ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలనుఎండగడుతూనే, 6గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట  ఎమ్మెల్యే అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు మంగళవారం మండలంలోని గుంజలూరు, తిరుమలగిరి, గుంపుల, వల్లభాపురం, ఉండ్రుగొండ గ్రామాలతోపాటు వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.  గ్రామాల్లో మహిళలు కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.  అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ   ఒక్కసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని , చేతి గుర్తుపై   ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్‌ను గెలిపించి కానుకగా అందించాలని ఆయన అన్నారు.  అన్ని వర్గాల సంక్షేమం కోసం హస్తం పార్టీకే ఓటు వేయాలని తెలిపారు. ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ఓట్లడిగారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి,  తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు ధర్మార్జున్, టిడిపి రాష్ట్ర నాయకులు నాతాల రాంరెడ్డి,  వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకులుపిట్ట రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరన్న నాయక్, వేములపల్లివాసుదేవరావు, చింతమల్లరమేష్,దారోజు జానికి రాములు, అప్పి రెడ్డి,వెన్న మధుకర్ రెడ్డి, సమీర్, దొనకొండ మహేష్, లక్ష్మయ్య, రామకృష్ణ, మోహన్,  జంపాల అంజయ్య, మహేష్, వెంకన్న, శ్రీను  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love