కేంద్రంలో కాంగ్రెస్‌దే నైతిక విజయం

– బీఆర్‌ఎస్‌ బీజేపీ రెండు ఒకటైనందునే బీజేపీ గెలుపు
– ఎమార్పీఎస్‌ వ్యవస్థాపక నాయకులు సతీష్‌మాదిగ
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్‌దే నైతిక విజయం. బిడ్డ కవిత జైలు నుంచి బయటకు తీసుకరావడానికే ఆయన అపవిత్ర కలయికకు పాల్పడ్డారు.రాబోయే కాలంలో ఏపీలో రాజకీయాలు మరిపోతాయని కేంద్రలోని బీజేపి గుడ్డుకాలం ఏర్పడక తప్పదని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక నాయకులు సతీష్‌మాదిగ అన్నారు. బిడ్డను జైలు నుంచి బయటకు తీసుకరావడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. బీజేపీకి డిపాజిట్లు రాని నియోజకవర్గాలలో విజయ తీరానికి చేర్చి బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పరిమితం అయ్యిందన్నారు.బీజేపీ చేసుకున్న రహస్య ఒప్పందం వల్లనే తెలం గాణలో బీఆర్‌ఎస్‌ తుడు చుక పెట్టుకు పోయిం దన్నారు. కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాలలో ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీ ఎంపి సీట్లలో ఎలా గెలిచిందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో అరవింద్‌, ఈటల, బండి సంజరు, రఘునందన్‌ రావులు ఓడిపోయి పార్లమెంటు గెలవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో 400 సీట్ల నినాదంతో ప్రచారం చేసి 290కే పరిమితం కావ డాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ నేత చంద్రబాబు, నితీష్‌కుమార్‌ నుంచి ఏనాటికైనా ముప్పు తప్ప దని హెచ్చరించారు.

Spread the love