
ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నేరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, అదికారంలోకి వచ్చిన రేండు రోజుల్లోనే రెండు పథకాలు అమలు చేసి చూపమని,రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని రాంపూర్ సహకార సొసైటీ చైర్మన్ తరచంద్ నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లచ్చమోల్ల దత్తద్రీ అన్నారు.శుక్రవారం డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామ పంచాయతీ లలో ప్రజా పాలన అభయహస్తం గ్రామ సభలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి ఆరో తేదీ వరకు గ్రామాలలో గ్రామసభలు కొనసాగుతాయని, ప్రజలు తమకు కావాల్సిన సంక్షేమ పథకాల దరఖాస్తులను అందజేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ నాయకులు దేగ్గర ఉండి ప్రజలకు సహకరించారని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబం లాబ్ది పొందాలని, గ్రామంలో మిగిలిన వారందరూ శనివారం వరకు దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన రేండు రోజుల్లోనే రెండు పథకాలు అమలు చేసి చూపమని వివరించారు.ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నేరవేర్చుతమన్నారు.ఈ కార్యక్రమం లో మండల నోడల్ అధికారి చందర్ నాయక్,మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, సర్పంచ్ పాపాయి తిరుపతి,ఉప సర్పంచ్ యేంకనోల్ల రమేష్, ఎంపిటిసి సుజాత రవి,యూత్ అద్యక్షులు నర్సగౌడ్,కాంగ్రెస్ నాయకులు సందిప్, శేఖర్, రమేష్, గంగాధర్, చంద్రకాంత్, పంచాయతీ కార్యదర్శి వేముల దివ్య, అంగన్వాడీలు,అశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.