ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 

నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. వడ్డెకొత్తపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, సర్పంచ్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, ఎంపీటీసీ సభ్యులు సాయిని ఝాన్సీ రవితో కలిసి ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను  అమలు చేస్తామని తెలిపారు. నియోజవర్గంలో మిగిలిపోయిన అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు, అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతానని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తుందని చెప్పారు.  అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూడాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందన్నారు. ఆడబిడ్డల వివాహానికి లక్ష 116 సాయం తో పాటుగా, తులం బంగారాన్ని కూడా త్వరలోనే అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు తనను నేరుగా కలవాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వీరంగటి మహేందర్, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, దుంపల కుమారస్వామి, బండారి వెంకన్న, దంతాలపల్లి రవి, దంతాలపల్లి ఉపేందర్, బానోత్ వెంకన్న నాయక్, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ సీతారాం నాయక్, రెడ్డికుంట తండా సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, ఉపసర్పంచ్ మొర్రిగాడుదుల శ్రీనివాస్ గౌడ్, యూత్ నాయకులు అనపురం వినోద్ గౌడ్, ఆవుల మహేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love