– వలస నాయకుల మాటలు నమ్మొద్దు
– రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసులబాలరాజ్
నవతెలంగాణ-నసురుల్లాబాద్
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం పలాలు అందుతాయని, బాన్సువాడ నియోజకవర్గంలో ఇక కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఎవరు లేరు, ఉండరని రాష్ట్ర ఆగ్రో ఇండిస్టీస్ చైర్మన్ కాసుల బలారాజ్ అన్నారు. శనివారం నసురుల్లాబాద్ మండలంలోని మిర్జాపూర్, దుర్కి, బస్వాయిపల్లి, కంషెట్‌పల్లి గ్రామాల్లో పర్యటించారు. నసురుల్లాబాద్ మండలానికి రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ రాక సందర్భంగా మిర్జాపూర్, దుర్కి, బస్వాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
మిర్జాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర ఆగ్రో ఇండిస్టీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురికాకుండా ఏదైనా సమస్య ఉంటే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు గానీ నాకు గాని నేరుగా వచ్చి కలవాలని సూచించారు. వలస వచ్చిన నేతల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గ్రామ అభివృద్ధికై కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌తో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేక పోతే ఆ నియోజకవర్గం పార్టీ ఇన్ ఛార్జ్ ఉంటారు. అందుకనే ఆ రోజు మాజీ మంత్రి షబ్బీర్ అలీ అలా సూచించారు అని.. కానీ బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఇద్దరు ప్రభుత్వ నేతలు ఉన్నారని అన్నారు. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ప్రభుత్వ నేతలు ఉన్న చోట మరో పార్టీ ఇన్ ఛార్జ్ అవసరం లేదని అన్నారు. మిర్జాపూర్ గ్రామంలో మైనార్టీ భవనానికి నిధులు మంజూరు కృషి చేస్తానన్నారు.
వలస నేతల మాటలు తియ్యగానే ఉంటారు..
వలస నేతల మాటలు తియ్యగానే ఉంటాయని, నియోజకవర్గం అభివృద్ధికై ప్రతి యువకులు గ్రూప్ రాజకీయాలు మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలతో నేను నాతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజలతోనే ఉంటానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు యువజన ఎన్నికలు ఉన్నాయని యువజన ఎన్నికల పట్ల , కాంగ్రెస్ పార్టీ పట్ల యువజన నాయకులకు అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించే వాటిని గుర్తించి ఎన్నుకోవాలని యువకులను సూచించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, దామరంచ శంకర్, సీనియర్ నాయకులు కాలిక్, కంది మల్లేష్, అంకోల్ రాము, పురం వెంకటి, యూసుఫ్, ఇక్బాల్, అంబెం మోహన్, భాను గౌడ్, సాయిలు, ప్రతాప్ సింగ్, అజీమ్, అసద్ బాయి,దుర్కి మోహన్, మహేష్ పటేల్, మసూద్, తదితరులు పాల్గొన్నారు.