బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 

నవతెలంగాణ – కంటేశ్వర్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బల్క సుమన్ చేసిన అనుచిత వాఖ్యలను ఖండించారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇరంటి లింగం మరియు ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించి, ఎన్టీఆర్ చౌరస్త వద్ద బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇరంటి లింగం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బల్క సుమన్ వాక్యాలను ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుని పై అలాంటి వ్యాఖ్యలు చేయడం బాల్క సుమన్ సిగ్గుమాలిన తనానికి నిదర్శనమని ఆయన అన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇవ్వనప్పుడు ,దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చేయని సందర్భంలో బాల్క సుమన్ ఎందుకు మాట్లాడలేదని, కేసీఆర్ దగ్గర బానిసగా బల్క సుమన్ వ్యవహరిస్తున్నాడని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు వారు అధికారం కోల్పోవడం ద్వారా ఏమి చేయాలో తెలియక మాట్లాడుతున్నారని ,ప్రజలు తిరస్కరించినప్పటికీ టిఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని,బాల్కా సుమన్ కానీ ఇక ఎవరైనా టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల పై గానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కాని అనుచిత వాక్యాలు చేస్తే ఊరుకునేది లేదని రోడ్లపై తరిమి కొడతామని ఇరాంటి లింగం వ్యాఖ్యానించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ దేగం ప్రమోద్ ,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్,షోబాన్, అవీన్,నర్సింగ్ రావు, మోతే సాయన్న,శశి కుమార్, ఎంబా మోహన్,రాజు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love