ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

– ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
– నార్లపూర్  గ్రామంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు
– కాంగ్రెస్ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క
నవతెలంగాణ -తాడ్వాయి : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని నార్లాపూర్ గ్రామంలో వివిధ పార్టీల నుండి మడకం శోభన్, మడకం లావణ్య, సరస్వతి, పద్మ, శ్రావణ్, అన్వేష్, రిజ్వాన్, తదితర 30 మంది, కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వీరిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులు మహిళలు వృద్ధులు వికలాంగులు, విద్యార్థులకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్య స్కీం లను వెంటనే అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. ములుగు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కలిగించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోల్లు దేవేందర్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, అర్రెం లచ్చు పటేల్, జిల్లా కార్యదర్శి తాండాల శ్రీను, మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వర రావు, గ్రామ కమిటీ అధ్యక్షులు మొక్క శ్రీను, అనంతరెడ్డి, పీర్ల వెంకన్న యానాల సిద్దిరెడ్డి ఎనగంటి రామయ్య సంజీవరెడ్డి సంతోష్ రెడ్డి తూలం కృష్ణ కట్కూరి భాస్కర్ మొక్క దుర్గయ్య సంజయ్ గౌడ్ కారంగుల రాంబాబు శ్రీను ధరావత్ మంగులాల్ దేవేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love