Friday, June 12, 2026
E-PAPER
Homeజాతీయంజంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాంగ్రెస్ ఆందోళ‌న‌

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాంగ్రెస్ ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కారు. మీనాక్ష నట‌రాజ‌న్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నామినేష‌న్‌ను తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే. ఈమేర‌కు శుక్ర‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం(ఈసీ) నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద సత్యాగ్రహం పేరుతో భారీ ఆందోళ‌న‌లు చేప‌ట్టారు కాంగ్రెస్ నేత‌లు. తొలుత ఓట్ చోరీ ఆ త‌ర్వాత సీటు చోరీ అంటూ బ్యాన‌ర్ ప్ర‌ద‌ర్శించారు. ఈసీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు చేత‌బూని కేంద్రానికి వ్య‌తిరేకంగా స్లోగ‌న్స్ ఇచ్చారు. ఈసీ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ న‌ట‌రాజ‌న్ సుప్రీంను ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. తాజాగా శుక్ర‌వారం ఉన్న‌త న్యాయ‌స్థానంలో స‌దురు పిటిష‌న్‌పై విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -