‘పెన్షనర్ల ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను అడ్డుకునే కుట్రలు మానుకోవాలి’

– తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం డిమాండ్‌
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
పెన్షనర్లకు కేటాయించిన ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ను అడ్డుకునే కుట్రలు మానుకోవాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం డిమాండ్‌ చేసింది. ఇళ్ల స్థలాల పంపిణీని విచ్ఛిన్నం చేయాలనే కుట్రదారుల చర్యలు పసిగట్టి పెన్షన ర్లకు న్యాయం చేయాలని కోరింది. ఈ మేరకు అసెంబ్లీ వద్ద గల గన్‌పార్కు వద్ద తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సం ఘం రాష్ట్ర అధ్యక్షులు కనకం కొమురెల్లి, ప్రధాన కార్యదర్శి తూము అశోక్‌ రెడ్డి, నేతలు జి.సూర్యకళ, వేణుగోపాల్‌, దివాకర్‌, భద్రయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం శేరిలింగంపల్లిలోని గోపన్న పల్లిలో ఉద్యోగులకు నాటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిం చగా కొంత మంది ఉద్యోగ సంఘాల నేతల స్వార్థపూరిత చర్యల వల్ల న్యాయస్థానం వివాదంలో చిక్కుకుని పంపిణీ ప్రక్రియ పూర్తి కాలేదని గుర్తు చేశారు. దీంతో 30 ఏళ్లుగా ఎదురు చూస్తూ పెన్షనర్లకు 76 ఏళ్ల నుంచి 81 సంవత్సరాల వయసు వచ్చిందని తెలిపారు. దీంతో ప్రస్తుత భాగ్య నగర్‌ టీఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీ పాలకవర్గం ఈ స్థలాన్ని తన అధీనంలోకి తీసుకుని సర్వీస్‌ సీనియారిటీ ప్రకారం 845 మంది సీనియర్‌ పెన్షనర్లను లబ్ధిదారులుగా గుర్తించిందని చెప్పారు. కాగా సొసైటీతో సంబంధం లేని కొంత మంది ఈ ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రుల వద్దకు వెళ్ళి సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేయాలని, నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం లేదని అవాస్తవాల తో మంత్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. పెన్షనర్ల పట్ల మానవతా దక్పథంతో వ్యవహరిం చి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కాసుల కొండయ్య, లక్ష్మణ్‌ రావు, పుట్టలయ్య, ఝాన్సీరాణి, పవన్‌ కుమార్‌, రామనాథ చెట్టి, ఉద్యోగ సంఘం నేతలు అబ్దుల్‌ సాదిక్‌, జాకీర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love