నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలంలోని మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠిక పఠనం చేయించారు. విద్యార్థులందరికీ రాజ్యాంగం గురించి వ్యాసరచన పోటీలు, వకృత్వ పోటీలు, డ్రాయింగ్ అండ్ క్విజ్ పోటీలను నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి రాజ్యాంగం అనే అక్షరాలను ఏర్పరిచారు. ఈ సందర్భంగా రాజ్యాంగ తయారీలో ముఖ్య భూమిక పోషించిన రాజ్యాంగ రచన కర్తలైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మొదలైన రాజ్యాంగ సభ సభ్యులందరికి నివాళులర్పించి వారి ఘనతను కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, పిఆర్టీయూ వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి సి.వి నరసింహారావు, ఉపాధ్యాయులు కృష్ణవేణి, గణేష్, మహేందర్, రత్నయ్య, శ్రావణ శ్రీ, సురేష్, తదితరులు పాల్గొన్నారు.