Saturday, July 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రూ.200 కోట్లతో నిర్మాణం.. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు

రూ.200 కోట్లతో నిర్మాణం.. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి 
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం హబ్సిపూర్ గ్రామ శివారులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం ప్రతిపాదిత స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ  దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. నియోజకవర్గ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే సంకల్పంతో ఈ పాఠశాలను దుబ్బాకకు తీసుకురావడానికి తాను మొదటి నుంచే కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలో హబ్సిపూర్ శివారులోని ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి స్కూల్ నిర్మాణానికి అనువైన అంశాలపై అధికారులతో సమీక్షించారు. 2024 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు.

స్కూల్ మంజూరును ఇతరులు తమ కృషిగా చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసిందని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వసతులు, డిజిటల్ విద్య, క్రీడా సదుపాయాలు, పోటీ పరీక్షల శిక్షణ వంటి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దుబ్బాక నియోజకవర్గo విద్యా రంగంలో గణనీయమైన మార్పు వస్తుందని, విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశ లభిస్తోందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -