మట్టి రోడ్డు ఏర్పాటు

Navatelangana,Telugu News,Telangana,Khammam– ‘నవతెలంగాణ’ కథనానికి స్పందన
నవతెలంగాణ-కరకగూడెం
నవతెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పత్రికలో సోమవారం రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం అనే శీర్షిక తో ప్రచురితమైన కథనానికి మండల ఎంపీడీఓ దేవవార కుమార్‌ స్పందించి బుధవారం బట్టుపల్లి గ్రామంలో తాత్కాలిక మట్టి రోడ్డును వేయించారు. తాత్కాలిక రోడ్డు వేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు వేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love