కలెక్టరేట్ కార్యాలయంలో కొత్త భవనాల నిర్మాణం

– ఆదేశాలు జారీ చేసిన మంత్రి  కోమటిరెడ్డి
– కలెక్టర్, అదనపు కలెక్టర్ చాంబర్ల నిర్మాణం
– మొదటి అంతస్తులు మంత్రుల ఛాంబర్
– పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ప్రస్తుత జిల్లా కలెక్టర్  కార్యాలయం లో ఉన్న జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల గదులు, సమావేశ మందిరాలు ఇరుకుగా, చిన్నవిగా ఉన్నందున ప్రస్తుత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోనే అన్ని సౌకర్యాలతో విశాలమైన గదులు, సమావేశ మందిరాలతో భవనాల నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ప్రస్తుత కలెక్టరేట్లో సిబ్బంది వసతి సైతం ఇరుకుగా ఉండడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాలలో నూతన కలెక్టరేట్ల నిర్మాణం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని  ప్రస్తుత కలెక్టరేట్ ఆవరణలోనే కొత్త భవనాల నిర్మాణానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆర్కిటెక్చర్ ఉషా రెడ్డి, అలాగే ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు కలెక్టరేట్ ఆవరణలో నూతన భవనాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.  నూతన భవనాల నిర్మాణంలో భాగంగా జిల్లా కలెక్టర్ , ఆదనపు కలెక్టర్లు,అలాగే  ఇతర  జిల్లాలలో నిర్మించిన నూతన  కలెక్టరేట్లలో మాదిరిగానే స్టేట్ చాంబర్ వంటి వాటి నిర్మాణానికి  చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. నూతనంగా నిర్మించనున్న జిల్లా కలెక్టర్ ఛాంబర్, అదనపు కలెక్టర్ల చాంబర్లు, మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్, అలాగే ఎక్కువ మందితో సమావేశం నిర్వహించే విధంగా మీటింగ్ హాల్,  సిబ్బంది పని చేసుకునేందుకు గదుల వంటి వాటికి స్థలాన్ని పరిశీలించారు. ఇదివరకే రూపొందించిన ప్రణాళిక ఆధారంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పలు సూచనలు చేశారు. నూతన భవనాలలో ఏర్పాటు చేయాల్సిన పలు సౌకర్యాలు, అవసరాలను జిల్లా కలెక్టర్  సూచన మేరకు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్థలాన్ని అలాగే ఆర్టీవో కార్యాలయం పరిసర ప్రాంతాలలో పరిశీలించడం జరిగింది. జిల్లా కలెక్టర్ సూచనలను పరిగణలో తీసుకుని ప్రస్తుత ప్రణాళికలో మార్పులు చేసిన తర్వాత రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమతి పొందిన తర్వాత వీటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో పాటు,  ఆర్కిటెక్చర్ ఉషా రెడ్డి,  సీఈ రాజేశ్వర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈ ఈ  యాకూబ్, డిప్యూటీ ఈ ఈ గణేష్ సర్వే ల్యాండ్ రికార్డ్. ఏ డి శ్రీనివాస్, ఆర్టీవో లావణ్య తదితరులు ఉన్నారు.

Spread the love