నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం చౌరస్తాలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో షెడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మాజీ జెడ్పీటీసీ నాగభూషణం రెడ్డి పేర్కొన్నారు. ఈ చౌరస్తాలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు బస్సుల కోసం ఎండలో నిరీక్షిస్తున్నందున, షెడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని లైన్స్ క్లబ్ వారితో సంప్రదించగా వారు స్పందించి షెడ్డును నిర్మించడానికి ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ జిల్లా కార్యదర్శి జావీద్ ఉద్దీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాయిబాబా గౌడ్, బి రవి, గైని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.