తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

TTDనవతెలంగాణ – తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (బుధవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న (మంగళవారం) శ్రీవారిని 79,365 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 14న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 23న ఉదయం 6 గంటలకు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా.. సెప్టెంబర్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.111 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Spread the love