వంట గ్యాస్ ఇక రూ.500 ల కే….

– 8 వేల కు పైగా కుటుంబాలకు లబ్ధి..
– ముందస్తు ఆన్ లైన్ బుకింగ్ చేస్తేనే రాయితీ..
– ఆధార్ కీలకం కానున్న వైనం..
– మండలంలో వంటగ్యాస్ వినియోగ దారులు 14 వేల పైమాటే
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉంది.ఇప్పటికీ మహిళలు కు ఉచిత బస్ ప్రయాణం, రోగులకు ఆరోగ్య శ్రీ వ్యయం పెంపు అమలు అవుతుండగా గృహ జ్యోతి,రూ 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అమలు చేయడానికి సిద్దం అవుతుంది. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం లో మొత్తం 14500 మంది వంట గ్యాస్ వినియోగ కనెక్షన్ లు ఉన్నట్లు పలు ప్రైవేటు గ్యాస్ కంపెనీల ఇచ్చిన సమాచారం బట్టి తెలుస్తుంది. ఇందులో భారత్ గ్యాస్ 8 వేలు,హెచ్.పి 5 వేలు,ఇండేన్ 15 వందలు మొత్తం గా 14500 గ్యాస్ వినియోగ కనెక్షన్ లు ఉన్నాయి.ప్రజాపాలన లో 8318 మంది గ్యాస్ రాయితీ కోసం దరఖాస్తు తో చేసుకున్నారు. మండలంలో మొత్తం 15775 గృహాలు కు గాను 17524 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న మొత్తం లబ్ధిదారులకు ఈ పథకం తో లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అయితే గ్యాస్ వినియోగ దారుడు ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ కార్డు కీలకం కానున్నది.ఈ ఆధార్ కార్డు గ్యాస్ కార్డు తో,ఇదే వ్యక్తి బ్యాంక్ ఖాతాతో నూ అనుసంధానం అయి ముందస్తుగా ఆన్లైన్ లో బుక్ గ్యాస్ బండను బుక్ చేస్తేనే రాయితీ జమ అయ్యే  అవకాశం ఉంది అని అలాగే ఖాతాదారుల ఫోన్ నెంబర్ లు కూడా ఆధార్ కు అనుసంధానం అయితే రాయితీ సమాచారం తెలిసే అవకాశం ఉందని గ్యాస్ ఏజెన్సీ యజమానులు అంటున్నారు.
Spread the love