Sunday, September 13, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సీపీ సుమతి సరికొత్త ప్రయోగం..

సీపీ సుమతి సరికొత్త ప్రయోగం..

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: నగరంలో పోకిరీల ఆట కట్టించేందుకు మల్కాజ్‌గిరి సీపీ సుమతి సరికొత్త ప్రయోగం చేశారు. సీపీ మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 వరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. ఈ సందర్భంగా అధికారి సుమతిని పోకిరీలు చుట్టుముట్టారు. అసభ్య పదజాలంతో వేధించారు. దీంతో, దాదాపు 40 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, స్పెషల్ ఆపరేషన్‌లో పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగార్థులు కావడం గమనార్హం. వీరిలో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. 40 మంది పోకిరీలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -