సీపీఐ(ఎం).. కాంగ్రెస్ నాయకుల గడప గడప ప్రచారం

నవతెలంగాణ- డిండి:  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేనావత్ బాలునాయక్ గెలుపు కాంక్షిస్తూ సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకులు డిండి మండలంలో హస్తం గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని గడప గడప కు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. గురువారం  డిండి మండలం బొగ్గులదోన, కాల్యతండా, ప్రతాప్ నగర్, గ్రామాలలో మిత్ర పక్షాల నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి నేనావత్ బాలునాయక్ గెలుపు కొరకు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆరు అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలను తెలియచేస్తూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ మండల నాయకులు ఆంగోత్ గోపాల్ బీఆర్‌ఎస్‌ పార్టీ కి రాజీనామా చేసి బ్లాక్ కాంగ్రెస్ డిండి మండల అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జరుపల లక్ష్మీ తిరుపతినాయక్, తూం వెంకట్ నారాయణరెడ్డి, సర్వన్ నాయక్, గడ్డమీద సాయి, చెన్నయ్య, లక్ పతినాయక్, పున్న దినేష్, భధ్యనాయక్, సిపిఐ నాయకులు బొడ్డుపల్లి వెంకటరమణ, తూం బుచ్చిరెడ్డి, ఎండి మైనొద్దీన్, బొల్లే శైలేష్, నూనె వెంకటేశ్వర్లు, సోమిరెడ్డి శ్రీనయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love