– సమస్యల వలయంలో గ్రామాలు
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని శిరసనగండ్ల గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీలలో శుక్రవారం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. శిరసన గండ్ల ఎస్సీ కాలనీలో ఎల్లమ్మ గుడి నుంచి ట్యాంకు దాకా సీసీ రోడ్డు వేయాలని, సిరిసినగండ్ల నుండి చిన్న గూడెం వరకు రోడ్డు ప్రమాదకరంగా ఉన్నదని తెలిపారు. కనీసం నడవడానికి కూడా కూడా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. తారు రోడ్డు వేయాలని ఈ గ్రామవాసులు తెలియజేశారని అన్నారు. అదేవిధంగా ఆరులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కాస్తలో ఉన్న రైతులకు పట్టేదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. గొర్రెలకు, మేకలకు, సరియైన మందులు ప్రభుత్వం ఇవ్వక పశువులు రోగాల పాలై మూగ జీవాలు చనిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి జీవాలకు మందులు ఇవ్వాలని గ్రామస్తులు తెలిపారని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారెంటీలలో అన్నిటినీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు దూరపల్లి మల్లయ్య, శాఖ కార్యదర్శి తుడుం వెంకటయ్య, కమిటీ సభ్యులు సైదులు,శంకరమ్మ, బాష్పాక గిరి, దోరేపల్లి శంకరయ్య, వెంకటయ్య,నాగయ్య, సైదులు,తదితరులు పాల్గొన్నారు.