ప్రజా పోరాటాల విప్లవ స్పూర్తి కాసాని: సీపీఐ(ఎం) కొక్కెరపాటి పుల్లయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎంత కష్టం వచ్చినా చివరి శ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఒకే పార్టీ లో మనుడసాగించడం అనేది నేటి స్వార్ధ రాజకీయ, వినిమయ ఆర్ధిక సంస్క్రుతి లో అరుదైన విషయం,అయినప్పటికీ నమ్మిన సిద్దాంతాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు ను,వ్యక్తి గత  కష్టాలను అధిగమించి, అనారోగ్యంతో బాధపడుతూ,చనిపోవడానికి 24 గంటలు ముందు సైతం పార్టీ రాష్ట్ర మహాసభలు విజయవంతానికి ఆనందంతో బెలూన్ లు ఎగురవేసిన ప్రత్యక్ష ప్రజా పోరాటాల విప్లవ స్పూర్తి కాసాని ఐలయ్య అని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఈ నెల తొమ్మిదిన జరుగుతున్న ఐలయ్య సంస్మరణ సభ జరుగుతున్న సందర్భంగా పార్టీ పరంగా,వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని,వారితో పెనవేసుకున్న కొన్ని జ్ఞాపకాలను పుల్లయ్య నవతెలంగాణ తో పంచుకున్నారు.
1989 లో నేను పార్టీలో చేరినప్పటి నుండి ఐలయ్య నీతివంతమైన వ్యక్తిత్వం, నిజాయితీ తో కూడిన రాజకీయ కార్యాచరణ తనకు స్పూర్తి నిచ్చాయి అన్నారు.ఆయన సుజాత నగర్ సర్పంచ్ గా, వామపక్ష రాజకీయ వ్యవహారాలు అమలు చేసిన తీరు నేను సర్పంచ్ విధులు నిర్వహించడంలో తోడ్పడ్డాయని గుర్తు చేసారు. తాను జిల్లా కార్యదర్శి గా పని చేసిన కాలంలోనే,నేను డివిజన్ కార్యదర్శిగా పనిచేయడం తో ఆయన ఆదర్శవంతమైన,నిష్పక్షపాత వైఖరి న నా రాజకీయ ఎదుగుదలకు కారణభూతమైనదని  అన్నారు. తాను, తన భార్య లక్ష్మీ సైతం పార్టీ కి అంకితం అయి పని చేయడం ఆదర్శనీయ మైన వ్యక్తిత్వానికి నిజరూపం అన్నారు. అనారోగ్యంతో ఉండి కూడా సీతారామ ప్రాజెక్ట్ పనులు వేగవంతానికి,నిర్మాణంలో నాణ్యతా లేమిని బహిర్గతం చేయడానికి ఆలోచించే వారని తెలిపారు.నిత్యం ప్రజల్లో ఉంటేనే పార్టీ విస్తరణ సాధ్యం అని నిరూపించిన ఆదర్శ మార్క్సిస్టు దంపతులు ఐలయ్య,లక్ష్మి లు,వీరు భవిష్యత్తు తరం పార్టీ శ్రేణులకు ఆదర్శప్రాయులు గా పార్టీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
Spread the love