ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం: సీపీఐ(ఎం) రామచంద్రయ్య

నవతెలంగాణ – నాగార్జునసాగర్
సమస్యల పరిష్కారం కొరకు ప్రజల పక్షాన సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని సీపీఐ(ఎం) పార్టీ పెద్దవూర మండల కార్యదర్శి దుబ్బా రామచంద్రయ్య, కెవిపిఎస్ జిల్లా నాయకులు దొంతాల నాగార్జున అన్నారు. సోమవారం నాగార్జునసాగర్ పైలాన్ శాఖ సీపీఐ(ఎం) పార్టీ సమావేశాన్ని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్కే బషీర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య, కేవీపీఎస్ జిల్లా నాయకులు దొంతాల నాగర్జున మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ లో ఉన్న స్థానిక సమస్యలపై అధ్యయనం చేసి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ లో కృష్ణానది దగ్గరే ఉన్న గుప్పెడు తాగునీరు దొరకక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ముఖ్యంగా రైతులు సాగుచేసుకుంటున్న పంటలకు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయి నష్టాల్లో కూరుకుపోయారని, పంట నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వేసవి కాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు గురికాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం సీపీఐ(ఎం) పార్టీ పైలాన్ శాఖను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పార్టీ సభ్యులు పాప బత్తిని ఆనంద్ పాల్,బండారి వెంకటేశ్వర్లు,బండారి రోశయ్య, బండారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పైలాన్ శాఖ కార్యదర్శిగా బత్తుల గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నిక : సీఐటీయూజిల్లా నాయకులు ఎస్కే బషీర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాగార్జునసాగర్ పైలాన్ శాఖ సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శిగా బత్తుల గోవింద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సహాయ కార్యదర్శిగా ఎండి యూసఫ్ ఎన్నికయ్యారు.
Spread the love