ప్రజా పోరాటాల పార్టీ సీపీఎం : సింగారపు రమేష్‌

నవతెలంగాణ-పాలకుర్తి రూరల్‌
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరా డే పార్టీ సీపీఎం అని త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజా తంత్ర, సామాజిక, లౌకిక పోరాట శక్తులను గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్‌ అన్నారు. సోమవారం పాలకుర్తి మండలంలోని మంచుపు ల గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశా నికి కాకర్ల బాబు అధ్యక్షత వహించగా రమేష్‌ పాల్గొని మాట్లాడుతూ మూడు నినాదాలతో సీపీఎం ఎన్నికల్లో ప్ర జల ముందుకు పోతుందని చెప్పారు. కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తుందని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని, నియంత్రిత చట్టాల ను తీసుకువస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులన్నీ అదాని, అంబానీ లాంటి కార్పొరేట్‌ కుబేర్లకు కట్టబెడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉ న్న పార్టీని గద్దెదించటం అవసరమని స్పష్టం చేశారు. క మ్యూనిస్టులు బలంగా చట్టసభల్లో ఉన్న కాలంలోనే ఉపా ధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టాలు వచ్చాయన్నారు. ఆర్థిక సంస్కరణలో ప్రైవేటీకర ణకు పెద్దపీట వేయకుండా అడ్డుకట్ట వేసింది కమ్యూనిస్టు లేనన్నారు. ఎల్‌ఐసి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యో గుల్ని కార్మికుల్ని కాపాడే పోరాటాలు నిర్వహించామన్నా రు. ఆ పోరాట చరిత్రను తెలంగాణ ప్రజలు గుర్తు చేసు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న,మండల కార్యదర్శి మా చర్ల సారయ్య, మండల నాయకులు సోమసత్యం, కాకర్ల పెద్ద సోమయ్య, కాకర్ల రమేష్‌, కాకర్ల పద్మ, ఎల్లయ్య, కా కర్ల పెద్దబాబు, కొండయ్య, బిక్షపతి, లక్ష్మి, యాకలక్ష్మి, యా దమ్మ, లచ్చమ్మ, బుచ్చమ్మ, వెంకటయ్య, కాకర్ల ప్రవీణ్‌, చంద్రమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Spread the love