నకిలీపై ఉక్కుపాదం

– అప్రమత్తమైన అధికారులు
– జిల్లా సరిహద్దులో తనిఖీలు కట్టుదిట్టం
– టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో నిరంతరం నిఘా
నకిలీ విత్తన రహిత జిల్లాగా చేయటమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు నకిలీ విత్తనాల చెలామణిపై ఆరా తీస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి నకిలీ విత్తనాలను సరఫరా చేయకుండ జిల్లా సరిహద్దులో పకడ్బందీగా నిఘా పెట్టారు. అగ్రికల్చర్‌, పోలీసు అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ బృందాల ద్వారా తనిఖీలు చేపడుతున్నారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడి మోసపోకుండా చూడాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలో పత్తి సాగు అత్యధికంగా ఉంటుంది. సుమారు మూడు లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారు. వర్షాదార పంటగా పత్తిని సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతారు. దీనిని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తన సరఫరా దారులు పత్తి రైతులకు నాసిరకం విత్తనాలు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ప్రతియే టా నకిలీ విత్తనాలు రైతులకు అంటగడుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీనిని అరికట్టేందుకు అధికారులు ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసినా రైతులను బురిడి కొట్టించడంలో నకిలీ విత్తనాల విక్రయదారులు విజయం సాధిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నాసికరం విత్తనాలు తీసుకువచ్చి రైతులకు అంటగడుతున్నారు. అయితే ఈ ఏడాది దీన్ని పూర్తిగా అరికట్టేందుకు ముందస్తుగా జిల్లా కలెక్టర్‌ ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
వానాకాలం సాగుకు సంబంధించి సుమారు 4 లక్షల 45 వేల 428 హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగుకు చేయనున్నట్టు అధికారులు అంచనాలు వేశారు. ఇందుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధం సిద్ధం చేస్తున్నట్టు తెలు స్తోంది. నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బం దీగా వ్యవహరిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నకిలీ సీడ్‌ జిల్లాలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్య లు చేపడుతున్నారు. నకిలీ విత్తనాల తయారీదా రులు, వాటి విక్రేతలను గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకోనున్నారు. అలాగే, గడువు ముగిసిన వి త్తనాలను, లైసెన్స్‌ లేకుండా విక్రయించే వాటిని, ఒక ప్రాంతంలో లైసెన్స్‌ కలిగి ఉండి, వేరే చోట విక్ర యాలు జరిపేవారి పైనా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు అధికారులు అదేశాలు జారీ చేశారు. పోలీస్‌ శాఖ అధికారులతో కూడిన టాస్క్‌ఫో ర్స్‌ బృందాలు నిరంతరం నిఘా కొనసాగిస్తు న్నాయి. పదేపదే నకిలీ విత్తనాల దందాను నిర్వ హించే వారిని గుర్తిస్తూ పీడీ యాక్టు పెడుతున్నా రు. ఇటీవల రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులతో కలిసి ఎలివెర్తి గేటు సమీపంలో ఆగి ఉన్న ట్రక్కులో నిషేధిత పత్తి వి త్తనాలు స్వాధీనం చేసుకున్నారు. 14 క్వింటాళ్ల బీజీ-3/హెచ్‌టీ విత్తనాలను స్వాధీనం చేసుకు న్నారు. వీటి విలువ దాదాపు రూ.36 లక్షలు ఉం టుందని వెల్లడించారు. ఇలా జిల్లాలో అనేక ఘటన లు చోటుచేసుకుంటున్నాయి. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లా యంత్రాంగం అన్నీ రకాల చర్యలు తీసుకుంటోంది.

రైతులు జాగ్రత్తగా ఉండాలి
నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం గుర్తించిన వా టినే కొనుగోలు చేయాలి. విత్తనాలు కొనుగోలు చే సినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి. ఎవ రైనా నకిలీ విత్తనాలు అమ్మితే మా దృష్టికి తీసు కురావాలి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– గీతారెడ్డి, డీఏఓ

Spread the love