కేప్ టౌన్ : అత్యంత అరుదైన హంటా వైరస్ వెలుగు చూడటంతో క్రూయిజ్ నౌక నడిసంద్రంలో నిలిచింది. ఈ వ్యాధితో నౌకలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని నౌక నిర్వాహకులు తెలిపారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని కేప్ వేర్డ్ తీరంలో ఈ నౌక సహాయం కోసం వేచి చూస్తోందని పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. డచ్ నౌక ఎంవిహోండియస్ సుమారు 150మంది ప్రయాణికులతో అర్జెంటీనా నుంచి అంటార్కిటికా, దక్షిణ అట్లాంటిక్‌లోని పలు ద్వీపాలకు వారం రోజుల పాటు ప్రయాణించాల్సి ఉంది. అయితే ఈ నౌకలోని ప్రయాణికులు అరుదైన హంటా వైరస్ బారిన పడ్డారు. దీంతో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని కేప్ వేర్డ్ ద్వీపానికి చేరుకుని స్థానిక ఆరోగ్య అధికారుల నుంచి సహాయం కోరింది. అయితే ప్రయాణికులు దిగేందుకు అనుమతించలేదని నెదర్లాండ్స్ ఆధారిత ఆపరేషన్ ఓషన్ వైడ్ ఎక్స్ పెడిషన్స్ తెలిపింది. ప్రజారోగ్యం దష్ట్యా ప్రస్తుతానికి ఆ నౌకను రేవులో నిలిపేందుకు అనుమతించబోమని, తీరానికి దగ్గరగా బహిరంగ జలాల్లోనే ఉంటుందని కేప్ వేర్డ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపించే ఒక వ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది నౌకలో ఎలా వ్యాప్తి చెందిందో తెలియరాలేదని తెలిపింది. ఇద్దరు వైద్యులు, ఒక నర్సు, టెక్నీషియన్‌తో కూడిన వైద్య బృందాన్ని మూడు విడతలలో ఓడ వద్దకు పంపినట్టు కేప్ వెర్డేలోని ఓ అధికారి డాక్టర్ ఆన్ లిండ్‌స్ట్రాండ్ తెలిపారు. ప్రయాణికులను అంబులెన్స్ ద్వారా నౌక నుంచి విమానాశ్రయానికి తరలించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ఒకవేళ ప్రయాణికులను తరలించలేకపోతే, స్పెయిన్ దీవులలో ఒకటైన టెనెరిఫ్ లేదా లాస్ పాల్మాస్ ఓడరేవుకు తరలించే ప్రయత్నం చేస్తామని అన్నారు.
హంటా వైరస్‌తోనడిసంద్రంలో క్రూయిజ్ నౌక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



