దళిత బంధు బిఆర్ఎస్ బంధుగా మారింది

– ఎఐసిసి స్పోక్స్ పర్సన్ గౌతమ్ సేథ్
– కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
– అడ్డుకునే యత్నం చేసిన పోలీసులు
– పాల్గొన్న గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలతో ప్రజలను, దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఎన్జీ కళాశాల ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసిసి స్పోక్స్ పర్సన్, భువనగిరి,నల్గొండ పార్లమెంట్ మీడియా కో-ఆర్డినేటర్ గౌతమ్ సేథ్ మాట్లాడుతూ తెలంగాణలో దళిత బంధు పథకం బిఆర్ఎస్ బంధు మారిందని ఆరోపించారు. సంక్షేమ పథకాలను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్, కేటీఆర్ లు దోచుకుంటున్నారని విమర్శించారు.12 వేల అట్రాసిటీ కేసులు నమోదైన దళితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ స్కీంలు కచ్చితంగా అమలు అవుతాయని అన్నారు. నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యలు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా దళితులను మోసం చేస్తున్నాడని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రకటించిన వెంటనే దళితులను సీఎం చేస్తానని చెప్పి మాట తప్పడని ధ్వజమెత్తారు.గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మందడి శ్రీనివాసరెడ్డి, నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి, పాండు, జూలకంటి సైదిరెడ్డి, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, రాకేష్, శేఖర్ రెడ్డి, పాదం అనిల్, శేఖర్, జహంగీర్ బాబా సిద్దు, నందిని, శ్రీకాంత్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
Spread the love