బీజేపీ బడ్జెట్‌లో దళితుల నిధులు తగ్గింపు : డీహెచ్‌పీఎస్‌

నవతెలంగాణ-హనుమకొండ
అచ్చే దిన్‌మోదీ హైతో ముమ్‌ కీన్‌ హైఅంటూ అధికారానికి వచ్చినతరు వా త మోదీపేదల కోసం కాకుండా లేక బడా వ్యాపారస్థుల కోసం పనిచేస్తు కేంద్ర బడ్జెట్‌లో దళితులనిధులు తగ్గింపు చేశారని దళిత హక్కుల పోరాట డీహెచ్‌పీ ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్‌ ఆరోపించారు. డీహెచ్‌పీ ఎస్‌ హనుమకొండ జిల్లా ప్రథమ మహాసభలు శుక్రవారం హనుమకొండ బాలసముద్రం సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగాయి. దళిత కుల పోరాట సమితి రా ష్ట్ర గౌరవ అధ్యక్షులు కె.యేసురత్నం జెండాను ఆవిష్కరించారు . ప్రతినిధుల మ హాసభను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌ కుమార్‌ ప్రారంభం చేస్తూ మాట్లాడారు ఎన్నికల ముందు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అధికారానికి రావడానికి బీజేపీ పాలకులు అలవాటుపడ్డారని అదే తరహా తెలంగాణ రాష్ట్రంలో మాయమాటలు చెప్పి దళితులను యువకులను మోసం చేయాలని చూస్తు న్నారని అన్నారు. మోదీ రెండు పర్యాయాల పరిపాలనలో దళితుల బతుకులు దిగజార్‌ పోయాయని బడా వ్యాపారులకు మాత్రమే లబ్ది చేకూరుతున్నదని ప్ర జల సంక్షేమ పథకాలకు కత్తెర వేస్తూ ఆశ్రిత వ్యాపారులకు పరమాన్నం వడ్డిస్తు న్నారని ఎద్దేవాచేశారు. స్పెషల్‌ కాంపో నెంట్‌ ప్లాన్‌ కింద దళితులకు జనాభా ప్రకారం 16.6శాతం కేటాయించాలి కా నీ మోదీహయాంలో9-6.5 శాతం మధ్య ఊగిసలాడిందని బడ్జెట్‌ కోత వల్ల స్కాలర్షిప్‌ నిధులు తగ్గాయని దీనివల్ల 50 లక్షల మంది దళిత విద్యార్థులు నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఎస్సీ ఉద్యోగ నియామ కాలను మోదీ సర్కారు 40శాతం తగ్గించింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌కు ఈగతి పట్టింది. మోదీ ఈ పథకానికి నిధులను క్రమం గా తగ్గించి వేశారు. దళిత వ్యతిరేక బిజెపి రాచక పాలన అంతా ముగించడానికి ప్రజా ఉద్యమాలను ఉదతం చేస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి మధ్యల ఎల్లేష్‌, రెంటాల దేవా, కొట్టేపాక రవి, నిమ్మల మనోహర్‌, అఖి ల,కుమారస్వామి,శనిగారం రాజ్‌కుమార్‌, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love