జూలకంటి, సీతారాములు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సారంపల్లి మల్లారెడ్డి మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. ఈ మేరకు వారు వేరు వేరు ప్రకటనలు విడుదల చేశారు. మల్లారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్నిఅంశాలపైనా సమగ్రపట్టు ఉన్న అపార జ్ఞాని మల్లారెడ్డి అని కొనియాడారు. బడ్జెట్‌లోటు పాట్లను ఎత్తి చూపి అందరికీ విడమర్చి చెప్పడంలో మల్లారెడ్డి ప్రత్యేకత అని తెలిపారు. చట్టసభల్లో సాగునీటిరంగం, వ్యవసాయం, రెవెన్యూ, బడ్జెట్ అంశాలపై మాట్లాడాల్సిన సందర్భం వస్తే మల్లారెడ్డి సూచనలు, సలహాలు తీసుకునే వారిమని తెలిపారు. ఎవరికి ఏ సమాచారం కావాలన్నా టక్కున తీసిచ్చే నేర్పరి సారంపల్లి అని కొనియాడారు. రైతాంగ ఉద్యమ నిర్మాణంలో మల్లారెడ్డి కృషి మరువలేనిదని తెలిపారు. అందరితో నవ్వుతూ మాట్లాడేమల్లారెడ్డి మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా రైతాంగ ఉద్యమాలకు తీరని లోటు అని తెలిపారు.
ప్రజా ఉద్యమాలకు నష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



