రెవెన్యూ శాఖలో దళారుల దండ.. సర్కార్ భూమి పట్టా

– రెండు ఎకరాలు పట్టా చేసిన రెవెన్యూ అధికారులు
– కాసుల కోసం కక్కుర్తి ఇస్తానుసారంగా రిజిస్ట్రేషన్లు
నవతెలంగాణ లింగంపేట
రెవెన్యూ కార్యాలయంలో దళారు దందా కొనసాగడంతో సర్కార్ భూమిని పట్టా చేసిన సంఘటన లింగంపేట సబ్ రిజిస్టర్ పైసల్ కార్యాలయంలో చోటుచేసుకుంది. రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు పట్టా చేశారు కాసుల కోసం కక్కుర్తి పొడి ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట మండలంలోని రాంపూర్ తాండకు చెందిన లంబాడి చాంగి పేరుపైన గతంలో గత ప్రభుత్వం జీవన ఉపాధి కోసం రెండు ఎకరల ప్రభుత్వ భూమిని ఇచ్చింది సర్వేనెంబర్ 16/పైకి 3  చేసుకుంటున్నాను ఈ భూమి ప్రభుత్వ భూమి 1955 కాప్రా పహానిలో ప్రభుత్వ భూమిగా ఉంది. ఈ భూమి ని హైదరాబాదులో నివాసం ఉంటున్న పులి పాట మమత పేరు పైన గత వారం రోజుల క్రితం రెవెన్యూ అధికారులు పట్టా భూమిగా రిజిస్టర్ చేశారు. ప్రభుత్వ భూమిని వారసత్వం పట్టా చేసే అధికారం రెవెన్యూ అధికారులకు ఉన్నప్పటికిని పట్టా భూమిగా రిజిస్టర్ చేయడంతో రెవెన్యూ అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడి సర్కార్ భూమిని పట్ట చేయడంతో పలువురు మండిపడుతున్నారు.
రెవెన్యూ అధికారులు ఇష్టానుసారుగా దళాల్లో ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో నుండి రెవెన్యూపరమైనటువంటి భూములను రిజిస్ట్రేషన్ లో కొనసాగుతున్నాయని పలువురు వాపోతున్నారు స్లాట్ బుక్ చేసుకున్న సక్రమంగా భూముల రిజిస్ట్రేషన్ దళారులు ఉంటేనే భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారని చేతులు మారుతున్నాయని రెవెన్యూ అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సర్కార్ భూమి పట్టా చేయమని కొందరు రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నప్పటికిని ఆ భూములను సైతం పట్టా భూములుగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం అదేవిధంగా ఈనామ్ భూములను ఓవర్సీ లేకుండానే రిజిస్ట్రేషన్ లో చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఇతరులు ఇనాం భూములు రిజిస్ట్రేషన్ చేయమని స్లాట్ బుక్ చేసిన అలాంటి వారి స్లాట్ ను తిరస్కరించడం జరిగిందన్నారు అదే దళారులను ఆశ్రయించి వారికి ముడుపులు ముట్టితే ఓవర్సీ లేకుండానే పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్ భూములు రిజిస్ట్రేషన్ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఇసుక మొరం దందలు కొనసాగుతున్న ముడుపులు ఇచ్చిన వారికే అనుమతులు ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టాను రద్దు చేస్తా నరేందర్ తాసిల్దార్ ప్రభుత్వ భూమిని పట్టాను రద్దు చేస్తానని ఇప్పటికే పట్టా చేసుకున్న వారికి అమ్మిన వారికి సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు పట్టా చేసిన తర్వాత ప్రభుత్వ భూమిని తెలిసిందన్నారు.
Spread the love