డిఏఓహెచ్.డబ్ల్యూ.ఓ  పరీక్షలు సజావుగా నిర్వహించాలి..

– అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ముందుగా పరిశీలన చేయాలి
– పరీక్షా కేంద్రాలకు సెల్  ఫోన్లు, డిజిటల్ వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతులు లేవు.అదనపు  కలెక్టర్ బి.ఎస్. లత.
నవ తెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో సూర్యాపేట, కోదాడ లో డి.ఏ.ఓ అలాగే హాస్టల్ వెల్ఫేర్ అధికారి పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బి.ఎస్. లత అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే డి.ఏ. ఓ అలాగే హాస్టల్ వెల్ఫేర్ అధికారి పరీక్షల నిర్వహణ పై డిపార్టుమెంటల్ అధికారులు, చీఫ్  సూపరింటిడెంట్లు , రూట్ అధికారులు, బయో మెట్రిక్ ఇన్విజిలేటర్లు, ప్లయింగ్ స్కాడ్స్, ఐడెంటిఫికేషన్ అధికారుల లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదనవు ఎస్.పి నాగేశ్వర రావుతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ, జూన్ 24 నుండి 29 తేదీ వరకు కోదాడ, సూర్యాపేట నందు 2780 మంది అభ్యర్థులు ఉదయం , మధ్యాహ్నం పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.  ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు  అలాగే మధ్యాహ్నం 2.30 నుండి 5.00 వరకు పరీక్ష నిర్వహణ ఉంటుందని తెలిపారు. అదేవిదంగా డి.ఏ. ఓ పరీక్ష తేదీ 30.6.2024 నుండి 4.7.2024 వరకు సూర్యాపేట, కోదాడ కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు  మొత్తం 2025 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా సమయం ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.30 వరకు అలాగే మధ్యహం 2.30 నుండి 5.00 వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు.  పరీక్షలు సజావుగా సమర్థవంతంగా  నిర్వహించాలని అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారి పరీక్షకు  నిర్వహణకు కోదాడలో నాలుగు కేంద్రాలు అలాగే సూర్యాపేటలో ఒక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిదంగా డి.ఈ. ఓ పరీక్ష నిర్వహణకు కోదాడలో 3 కేంద్రాలు అలాగే సూర్యాపేటలో ఒక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఒక రోజు ముందుగా కేంద్రాలను పరిశీలించుకోవలని అన్నారు.  ఉదయం జరిగే పరీక్షకు 8.30 వరకు చేరుకోవాలని అలాగే 9.30   గంటలకు గేట్ మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. తదుపరి పరీక్షకు మధ్యహం 1.00 వరకు చేరుకోవాలని 2.00 గంటలకు గేటు మూసివేయడం జరుగుతుందని తెలిపారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు  లోపలికి అనుమతి ఉంటుందని అలాగే బయోమెట్రిక్ హాజరు తీసుకోబడుతుందని తెలిపారు.  పరీక్షా కేంద్రాలలో వికలాంగుల కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సౌకర్యాలను కల్పించడం జరిగిందని అన్నారు.   అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యంగా నిరంతర విద్యుత్ , త్రాగునీరు,  టాయిలెట్స్  ఉండాలని సూచించారు.పరీక్షా కేంద్రంలోకి డిజిటల్ వాచ్,  సెల్ ఫోన్, టాబ్స్ , పెన్ డ్రైవ్ లు,  పౌచ్ లు, రైటింగ్ ప్యాడ్స్ కాలిక్యులేటర్లు అలాగే బూట్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని సూచించారు.  అలాగే   ముక్యంగా మహిళలు ఆభరణాలు అలాగే  మెహంది వలన పరీక్ష హాల్ లో  బయో మెట్రిక్ క్యాప్చర్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. పరీక్షల రోజున విధుల్లో ఉన్న అధికారులు సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని అలాగే నియమించిన అధికారులు నిర్దేశించిన సమయానికి చేరుకోవాలని ఇప్పటికే అందరికి విధుల నియామక పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో శిక్షణ తీసుకున్న అంశాలపై దృష్టి సారించాలని టిజిపిఎస్ సి నిబంధనలు పాటించాలని సూచించారు.అధికారులందరు సమన్వయంతో బాధ్యతాయుతంగా కలసి పనిచేయాలని సూచించారు. పరీక్షలో పాల్గొను అభ్యర్థులు ఒక రోజు ముందుగా పరీక్షా కేంద్రాలను సందర్శించుకోవాలని తెలిపారు.సూర్యాపేట, కోదాడ  కేటాయించిన రూట్లలో ఆర్.టి.సి. బస్సులు నడపాలని సూచించారు. అదేవిదంగా అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డు వెంట తీసుకొని రావాలని అన్నారు.పరీక్షల నిర్వహణ సందర్బంగా కోదాడ, సూర్యాపేట కేంద్రాల్లో  పోలీస్ లను నియమించడం జరుగుతోందని ఆలాగే నిరంతర పర్యవేక్షణ చేయనున్నట్లు ఆదనవు ఎస్పీ నాగేశ్వర రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో  పరీక్షల విభాగం పర్యవేక్షకులు పద్మ రావు,  ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love