విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన దరిపల్లి అనంతరాములు

నవతెలంగాణ –  భువనగిరి
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఫౌండర్ దరిపల్లి అనంత రాములు చేసిన కృషి మరువలేమని వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ దరిపల్లి నవీన్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ ను తెలిపారు. బుధవారం వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో  వార్షికోత్సవ సంబరాలు, స్వర్గీయ దరిపల్లి అనంత రాములు జన్మదిన వేడుకలు  నిర్వహించారు. అనంతరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా  వారు మాట్లాడారు. దరిపల్లి అనంత రాములు జీవిత చరిత్రను తెలియజేశారు.  అనంతరాములు జీవిత చరిత్రతో పాటు  విద్యాసంస్థలు నెలకొల్పడంలో చూపిన చోరువను విద్యార్థులకు వివరించారు. తను  ఎందరో విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వేశారని , ప్రతీ ఇంటికి దీపమయ్యారని కొనియాడారు.  దరిపల్లి అనంత రాములు గారు భౌతికంగా మన మధ్య లేకున్నా గాని అతని ఆశయాలు విద్యార్థిని విద్యార్థుల రూపంలో ఎప్పటికీ నిరంతరం ఊపిరి పోసుకునే ఉంటాయి అని అన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో మన వాత్సల్య  కళాశాల విద్యార్థులకు 100% ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మొదటగా వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సురేష్ , వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ జిలకర సురేష్ గారు , మెకానికల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బద్దిగం వెంకటేశ్వర రెడ్డి, మధిర పరమేశ్వరి, సివిల్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అర్జున్, రాణా ప్రతాప్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కరుణాకర్, రాజు, ఎలెక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కొంక రేఖ , విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
Spread the love