Tuesday, April 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్..

దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌కు భారత దర్యాప్తు ఏజెన్సీలు భారీ షాక్ ఇచ్చాయి. దావూద్ కీలక అనుచరుడు, నిషేధిత డ్రగ్స్ తయారీలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సలీం డోలాను భారత్‌కు అప్పగించారు. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఆ దేశ జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థ, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో డోలాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని భారత్‌కు తరలించారు. ప్రస్తుతం డోలాను ఢిల్లీలోని ఆర్‌కే పురంలో ఉన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కార్యాలయంలో ఉంచారు. విచారణ అనంతరం అతడిని ముంబై పోలీసులకు అప్పగించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -