గణేష్‌ నిమజ్జనానికి పటిష్ట భద్రత : ఈస్ట్‌ జోన్‌ డీసీపీ

నవతెలంగాణ-ఆత్మకూర్‌
గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర మండలంలో ప్ర శాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగే విధం గా అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రజలు,భక్తులు సహకరించాలని ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రవీందర్‌ కోరారు. మంగళవారం మండలంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కటాక్షపూర్‌ పెద్ద చెరువును,నిమజ్జనం జరిగే ప్రదేశాలను ఈస్ట్‌ జోన్‌ డిసిపి స్థానిక సిఐ రవిరాజు,తహసీల్దార్‌ సురేష్‌ కుమార్‌,ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లతో పాటు,గణేష్‌ ప్రతిమలను నిమజ్జనం చేసేందుకుగాను క్రేన్ల వినియోగం,రోడ్డు మరమ్మత్తులు పరిశీలించి డిసిపి సంతృప్తి వ్యక్తం చేశారు. నిమజ్జన సమయంలో విధుల నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించి, అనంతరం వాహనం తిరిగి వెళ్ళే మార్గాలకు సంబంధించిన విషయాలపై డిసిపి పలు సూచనలు చేసారు.

Spread the love