Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలును  గురువారం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహంనికి, పూలమాలలు వేసి నివాళులర్పించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. యువతకు సాంకేతిక రంగాన్ని పరిచయం చేసి, దేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దూరదృష్టి నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు, ఇ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి , జిమ్మీ రవి, కోలా వెంకటేష్, బాలు రెడ్డ్, వాసు, రవికాంత్ రెడ్డి, గిరి, ఆజ్జు భాయ్, మీసాల రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -