వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : రైలు కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండల పరిధిలోని చింతపల్లి రైల్వే గేటు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుంటపల్లి గ్రామానికి చెందిన కలకొండ మహేందర్ మంగళవారం రైలు పట్టాల కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన జరిగిన ప్రాంతంలో అతడి తల, మొండం వేరు వేరు భాగాలుగా పడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో మహేందర్ ఒంటి‌పై జీన్స్ పాయింట్, షర్ట్ ధరించి ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Spread the love