దీప్తికి రూ.కోటి అందజేత

Deepti was awarded Rsహైదరాబాద్‌ : పారాలింపిక్స్‌ పతక విజేత, తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 కోటి నగదు బహుమతి అందజేసింది. మంగళవారం సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో రూ. 1 కోటి చెక్‌ను దీప్తికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాట్‌ చైర్మన్‌ కే. శివసేనారెడ్డి అందజేశారు. దీప్తి కోచ్‌ నాగపురి రమేశ్‌కు సైతం రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు.

Spread the love