వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం

– మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన  వైశ్య సంఘం నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు
వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు పట్ల ఆర్య వైశ్య సంఘము,వాసవి క్లబ్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి, హర్షం వ్యక్తం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా  మాట్లాడారు ఇటీవల జరిగిన  రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 16 కార్పొరేషన్ లలో అందులో ఒక్కటైన ఆర్యవైశ్య  కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. వైశ్య  కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల వెనకబడిన ఆర్యవైస్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చదువుకున్న వైశ్య యువతకు ఉపాధికి కొరకు లోన్ లు రావడం వలన వారికీ ఉపాధి లభిస్తుందని ఏది ఏమైనా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవవడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మండల అధ్యక్షుడు కుక్కడపు అశోక్, వెంకటేశ్వర్లు,ఓల్లాల నాగరాజు,బెజగం సతీష్,మమత, పవన్,భాస్కర్ పాల్గొన్నారు.
Spread the love