Thursday, June 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఫీజు పెంచినా హెచ్1-బీకి తగ్గని డిమాండ్

ఫీజు పెంచినా హెచ్1-బీకి తగ్గని డిమాండ్

- Advertisement -

ఏడాదిలోనే 2 లక్షల దరఖాస్తులు
ఈ ఆర్థిక ఏడాది డేటా వెల్లడించిన డీహెచ్‌ఎస్‌ సెక్రెటరీ ముల్లీన్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వలస దారుల పట్ల కఠినంగా వ్యవహారిస్తున్నా హెచ్1-బీ వీసాకు క్రేజ్‌ తగ్గట్లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో హెచ్1-బీ వీసా కోసం ఏకంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ఒక్కొక్కరు లక్ష డాలర్లు చెల్లించినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.83 లక్షలకు పైగా ప్రీమియం ఫీజుగా చెల్లించినట్లు యూఎస్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డీహెచ్ఎస్) సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ పేర్కొన్నారు. సబ్‌కమిటీ సమావేశంలో మాట్లాడిన ముల్లిన్‌ ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 2.86 లక్షల హెచ్1-బీ వీసా దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు.

అలా 15 రోజులు ఇలా అయితే ఏడాదిన్నర..
2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్-1బీ వీసా అభ్యర్థుల్లో దాదాపు రెండు లక్షల మంది తమ దరఖాస్తులు వేగంగా ప్రాసెస్ చేయడం కోసం 1 లక్ష డాలర్లు చెల్లించినట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్ఎస్) కార్యదర్శి మార్క్‌వేన్ ముల్లిన్ వెల్లడించారు. మంగళవారం సెనేట్ అప్రోప్రియేషన్స్ సబ్‌ కమిటీ ముందు వివరాలు వెల్లడిస్తూ 2026 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2.86 లక్షల హెచ్-1బీ వీసా దరఖాస్తులు అందినట్టు ఆయన తెలిపారు. వాటిలో 2 లక్షల మందికి పైగా 1 లక్ష డాలర్లు చెల్లించి తమ దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయించుకునే అవకాశాన్ని వినియోగించుకున్నారని అని ముల్లిన్ చెప్పారు. 1 లక్ష డాలర్లు చెల్లించిన దరఖాస్తుల ప్రాసెసింగ్ సుమారు 15 రోజుల్లో పూర్తవుతుండగా, సాధారణ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి దాదాపు ఏడున్నర నెలలు పడుతోంది.

ట్రంప్ ప్రకటించిన ఈ హెచ్1బీ వీసా ఫీజు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయించారు. దీంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసాకు లక్ష డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. దరఖాస్తు చేసుకొనే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్‌ ఫీజు అది. ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఆ ఫీజు విషయంలో మినహాయింపు ఇచ్చింది. దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుందని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గినట్టు ఇటీవల యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. ఉన్నత విద్య, అధిక వేతనాలు పొందుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే వారికే ఈసారి వీసాల మంజూరులో పెద్దపీట వేసినట్టు తెలిపింది. అమెరికా ఫస్ట్ అనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ఫలితంగానే ఈ మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొంది. 2026 ఆర్థిక సంవత్సరంలో 3, 43, 981 రిజిస్ట్రేషన్లు దాఖలు కాగా, 2027 ఆర్థిక సంవత్సరానికి ఆ సంఖ్య కేవలం 2,11, 600కు పడిపోయింది. 38.5 శాతం తగ్గుదల నమోదైంది. ఎంపికైన దరఖాస్తుల్లో అత్యధికంగా 71.5 శాతం మంది అమెరికాలో మాస్టర్స్ లేదా అంతకంటే పైస్థాయి విద్యను అభ్యసించిన వారే ఉన్నారు. గతేడాది ఈ సంఖ్య 57 శాతంగా ఉండేది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -