ఉత్తమ పనితీరు కనబరిచిన విద్యాసంస్థల వివరాలు పంపాలి

– విద్యాశాఖను కోరిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పిల్లలు వేసవిలో విత్తనాలు సేకరించి, వాటిని రుతుపవనాల రాకకు ముందు నాటడంలో పిల్లలకు సహకరించి ఉత్తమ పనితీరు కనబరిచిచన విద్యాసంస్థల వివ రాలు పంపించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కోరింది. ఆ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ జె.శ్రీనివాసరావు పాఠశాల విద్యా కమిషనర్‌కు లేఖ రాశారు. జిల్లా కు 10 విద్యా సంస్థ లను ప్రశంసా పత్రంతో సత్కరించనున్నట్టు తెలిపారు. వేసవిలో పిల్లలు విత్తనాలను సేకరించి వాటిని పాఠశాలలో నాటడం ద్వారా పర్యావరణం పట్ల బాధ్యత కలిగిన వారిగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు.

Spread the love