కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధి..

నవతెలంగాణ-తుంగతుర్తి: నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను ఆశీర్వదించి గెలిపించాలని తుంగతుర్తి మండల రైతు బంధు కోఆర్డినేటర్ దొంగరి శ్రీనివాస్ అన్నారు.శనివారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో గడపగడపకు బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేసింది ప్రజలందరికీ తెలుసునని, ఇప్పుడు ఒక్క అవకాశం అంటూ వస్తున్నారని, కాంగ్రెస్కు ఓటు వేస్తే తుంగతుర్తి అభివృద్ధి ఆగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మహిళలకు సౌభాగ్య లక్ష్మి 400 కే గ్యాస్ సిలిండర్ కెసిఆర్ బీమా ఆసరా పెన్షన్ పెంపు తదితర పథకాలు అమలు కావాలంటే రాష్ట్రంలో కేసీఆర్ పాలన తప్పనిసరి అని అన్నారు. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టడం ఖాయమని, గాదరి కిషోర్ కుమార్ హ్యాట్రిక్ విజయం తథ్యం అని అన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, జటంగి సత్యనారాయణ, మట్టిపల్లి వెంకట్, రేగటి శ్రీను, గుండగాని వెంకన్న, పోతరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love