దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం 

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పట్టణాల్లో, గ్రామాలలో అభివృద్ధి సాధ్యం అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు లోని ప్రీమియర్ ఎక్సప్లొజివ్స్ లిమిటెడ్ కంపెనీలోని ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి చామాల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాల్సిందిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డిలు ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజ్ గౌడ్, ఎంపీపీ చీర శ్రీశైలం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు ఆరే ప్రశాంత్ గౌడ్, సీస మనోహర్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love