– అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్
నవతెలంగాణ ధర్మారం
మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ను పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జి శ్యాం పసాద్ లాల్ గురువారం రోజున ఆకస్మికంగా సందర్శించి ధరణి పెండింగ్ ఫైల్స్, ప్రజావాణి ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తాసిల్దార్ ను కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు అనంతరం కార్యాలయములో చేపట్టిన మరమత్తు పనులను పర్యవేక్షించారు ఈ కార్యక్రమం లో తహశీల్దార్ ఎం.డి. అరిఫుద్దిన్, నాయబ్ తహశీల్దార్ ఉదయ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ నవీన్ రావు, మండల గిర్దావర్లు వరలక్ష్మి ,స్వరూప, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.