చెరువులు, గుట్టలను దోచుకున్న ధర్మారెడ్డిని సాగనంపాలి

– పరకాల కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్‌
దళితులను, బీసీలను, ఎస్టీలను అ వమానించిన దౌర్భాగ్యుడు ఎమ్మెల్యే చ ల్లా ధర్మారెడ్డికి గుణపాఠం చెప్పాలని పర కాల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిలు పునిచ్చారు. శుక్ర వారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌, హౌస్‌బుజుర్గ్‌, కందిబండ, నీరుకుళ్ల, పెం చికలపేట,పెద్దాపూర్‌ గ్రామాల్లో మహి ళలు మంగళ హారతులు, బోనాలతొ రేవూరి ప్రకాష్‌రెడ్డికి ఘన స్వాగతం పలి కారు. గ్రామ గ్రామాన పుష్పాభిషేకం తో ప్రజలు మహిళలు స్వ చ్ఛందంగా మీకు అండగా మేముంటా మని భారీ మెజార్టీతో గెలిపిం చుకుం టామని స్వాగతం పలికారు. రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లా డుతూ పరకాల నియోజక వర్గంలోని చెరువులను కుంటల ను గుట్టలను దోచుకున్న ధనంతో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలను దురాహంకారపు మా టలతో అవమానించిన దౌ ర్భాగ్యుడు చల్లా ధర్మారెడ్డి అని మండిపడ్డారు. నీ అవినీతి అక్రమాలు ప్రజలు చూస్తున్నారని..నీ దౌర్జన్యాలు, దాడులు ఇక సాగదని చల్లా ధర్మారెడ్డి ని ఘాటుగా హెచ్చరించారు. నీరుకుళ్ల పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థిని నేను నా పై చూపిస్తున్న మీ ఆదరభిమానాలకు శిరస్సు వంచి నమస్క రిస్తున్నానన్నారు. పరకాల ఇన్చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ దోచుకున్న ధనాన్ని ఓట్లకు నోట్లు ఇచ్చి కొనా లని చూస్తున్న చల్లా ధర్మారెడ్డి ఇచ్చే నోట్లు తీసుకొని తెలంగా ణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ చేతి గుర్తుకు ఓట్లు వేయాలన్నారు. గుట్టలను చెరువులను దోచుకున్న ధర్మారెడ్డికి దిమ్మతిరిగేలా ప్రజలు గుణపాఠంచెప్పాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమం లో ఎంపీపీ భీమగాని సౌజన్య, ఎంపీపీ మార్క సుమలత రజనీకర్‌గౌడ్‌, జెడ్పీటీసీ కక్కెడర్ల రాధికరాజుగౌడ్‌, కమలా పురం రమేష్‌, సర్పంచ్‌ పర్వతగిరి రాజు, బీరం సునంద సు ధాకర్‌ రెడ్డి, సర్పం చులు కంచ ర వికుమార్‌, ఎంపీటీసీలు బీరం రజనీకర్‌ రెడ్డి, పోగుల ఇంది రా రాసిరెడ్డి, ఎండి గఫూర్‌, అర్షం వరుణ్‌ గాంధీ, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.

Spread the love