కిషన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా ధర్నా సీఎం దిష్టిబొమ్మ దగ్ధం..

నవతెలంగాణ- రెంజల్
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా రెంజల్ మండలం సాట పూర్ చౌరస్తాలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కిషన్ రెడ్డి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 24 గంటలు ఉపవాస దీక్ష చేపట్టగా పోలీసులు ఆయనను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చా అని వారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా అక్రమంగా అరెస్టు చేయించడం శోచనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, బీజేపీ మండల అధ్యక్షులు గోపికృష్ణ, నిజమైన మండల అధ్యక్షులు ప్రకాష్, మండల కార్యదర్శి సంఘం శ్రీనివాస్, రెంజల్ మండల ఉపాధ్యక్షులు క్యాతం యోగేష్, బీజేపీ సీనియర్ నాయకులు మేక సంతోష్, ఎల్. కిషోర్, సోషల్ మీడియా బోధన్ డివిజన్ ఇంచార్జ్ సాయినాథ్, అజయ్, బిజెపి కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Spread the love