– దక్షిణాఫ్రికా 194/4
– అమెరికాతో సూపర్-8 మ్యాచ్
ఆంటిగ్వా: టి20 ప్రపంచకప్ సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు కదం తొక్కారు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్(74) అర్ధసెంచరీకి తోడు కెప్టెన్ మార్‌క్రమ్(46), క్లాసెన్(36నాటౌట్), స్టబ్స్(20నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 194పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్, వికెట్ కీపర్ డికాక్(74) రాణించినా.. మరో బ్యాటర్ రోడ్రిగ్స్(11) నిరాశపరిచాడు. దీంతో సఫారీ జట్టు 16పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మార్‌క్రమ్‌తో కలిసి డికాక్ 2వ వికెట్‌కు 110పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ ఔటయ్యాక దక్షిణాఫ్రికాను క్లాసెన్, స్టబ్ ఆదుకున్నారు. వీరిద్దరూ చివర్లో చెలరేగి ఆడడంతో ఆ జట్టు 194పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. అమెరికా బౌలర్లు నేత్రావాల్కర్, హర్మీత్ సింగ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు…
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి)షాయన్ (బి)హర్మీత్ సింగ్ 74, హెండ్రిక్స్ (సి)ఆండర్సన్ (బి)నేత్రావాల్కర్ 11, మార్‌క్రమ్ (సి)అలీ ఖాన్ (బి)నేత్రావాల్కర్ 46, డేవిడ్ మిల్లర్ (సి అండ్ బి)హర్మీత్ సింగ్ 0, క్లాసెన్ (నాటౌట్) 36, స్టబ్స్ (నాటౌట్) 20, అదనం 7. (20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 194పరుగులు.
వికెట్ల పతనం: 1/16, 2/126, 3/126, 4/141
బౌలింగ్: నేత్రావాల్కర్ 4-0-21-2, అలీ ఖాన్ 4-0-45-0, జోష్‌దీప్ సింగ్ 2-0-36-0, హర్మీత్ సింగ్ 3-0-29-0, స్టీవెన్ టేలర్ 2-0-21-0, ఆండర్సన్ 1-0-17-0