Thursday, July 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబ్రిక్స్ దేశాల మంత్రులకు విందు

బ్రిక్స్ దేశాల మంత్రులకు విందు

- Advertisement -

హాజరైన సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బ్రిక్స్ దేశాల మంత్రుల బృందానికి హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు, బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్-2026 ల నేపథ్యంలో బ్రిక్స్ మంత్రులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అధికా రికంగా విందు ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమంలో సీఎం ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్, డీజీపీ సీవీ ఆనంద్, కార్మిక శాఖ కార్యదర్శి హరి చందన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

​ బోనాల శుభాకాంక్షలు
రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు నేడు (జులై 16) ప్రారంభ‌మ‌వుతున్న సంద‌ర్భం గా రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్ర‌మే కాద‌ని, ఈ ప్రాంత ప్ర‌జ‌ల ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవం అని సీఎం చెప్పారు. నేటి నుంచి (జూలై 16) నుంచి ప్రారంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు మూడు వేలకు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, సికింద్రా బాద్ జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలు, తెలంగాణ గంగా జమునా తెహ‌జీబ్ సంస్కృతికి నిలువెత్తు నిద‌ర్శ‌మ‌ని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయని సీఎం వెల్ల‌డించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -