హనుమాన్ చాలీసా కరపత్రాల ఆవిష్కరణ

నవతెలంగాణ- ఆర్మూర్
అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా బ్రోచర్లను శనివారం ఆవిష్కరించినారు…సెప్టెంబర్ 10వ తారీఖు ఆదివారం నాడు శ్రీ నగేష్ శర్మ గురు స్వామి గార్ల ఆధ్వర్యం లో ఆంజనేయ స్వామి మరియు అయ్యప్ప స్వామి భక్తులందరూ ఏకకాలంలో సాయంత్రం 7.00 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం జంబీహనుమాన్ ఆలయం లో నిర్వహించుచున్న సందర్భంగా బ్రోచర్లను నగేష్ శర్మ గురు స్వామి , నోముల నవీన్ జిల్లా అధ్యక్షులు, పెంట. జలంధర్ ప్రధాన కార్యదర్శి ల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి ఈ కార్యక్రమం పదిమందికి తెలియజేయండి .సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము ప్రారంభించి 21సార్లు చదివి విశ్వశాంతి,సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం కోరుకుందాం. ఈ కార్యక్రమంలో ప్రచార సమితి జిల్లా,డివిజన్ మరియు మండల బాద్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, మరియు ఆంజనేయ స్వామి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారుహనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం చేసి విశ్వశాంతిని సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని వీరాంజనేయ స్వామిని కోరుకుందాం .మీరు తప్పక ఈ సమాచారాన్ని పదిమందికి అందజేస్తారని ఆశిస్తూ న్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్ శర్మ గురు స్వామి, నోముల నవీన్ జిల్లా అధ్యక్షులు, పెంట.జలంధర్ జిల్లా ప్ర.కా., దోన్ పాల్ రాజేశ్వర్ డివిజన్ అధ్యక్షులు, జోష్ నర్సారెడ్డి మండల అధ్యక్షులు, సురేష్ మండల ప్ర.కా.,ఉదయ్ డివిజన్ ఉపాధ్యక్షులు, గురు స్వాములు అయినా శ్రీహరి, విజయ్ కౌటిక, శివ ధనపాల్, గంగాధర్ గౌడ్,గోపి గుడి, ప్రసాద్, కోటయ్య పాల్గొన్నారు.

Spread the love