రేపు రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షలకు టీడీపీ పిలుపు

నవతెలంగాణ – హైదరాబాద్: నంద్యాలలో అరెస్ట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును ఇంకా కుంచనపల్లి సిట్ కార్యాలయంలోనే ఉంచారు. చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి, లోకేశ్ సిట్ కార్యాలయానికి వచ్చారు. అయితే చంద్రబాబును కలిసేందుకు ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో వారు సిట్ కార్యాలయంలో వేచిచూస్తున్నారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీడీపీ రేపు రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ చేపడుతున్న నిరాహార దీక్షల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ఈ రాత్రికి కాగడాల మార్చ్ నిర్వహించాలని పేర్కొన్నారు.

Spread the love