– సంబంధం లేని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం దారుణం.
– తెలుగుదేశం పార్టీ అధినేత అక్రమ అరెస్టును ఖండించిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ని స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుమీద అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు. శనివారం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. చేతకాని ఈ వైసీపీ ప్రభుత్వం తెదేపా నాయకులను అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని.. ఓడిపోతామని గమనించిన జగన్ రెడ్డి, బాబు ని నిలువరించడానికి చేసే ప్రయత్నమే ఈ అక్రమ అరెస్ట్ అని తెలిపారు. సంబంధం లేని కేసులతో అరెస్టు చేయడం అత్యంత దారుణమని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పే రోజు తొందరలోనే ఉందని..ఈ సందర్భంగా ఆయన సంఘీభావం తెలియజేస్తు.. వారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.