నవతెలంగాణ – విజయవాడ: ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. అటాచ్‌మెంట్‌కు అనుమతించాలంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా?లేదా? అనే విషయాన్ని జప్తు కోసం అభ్యర్థించిన అధికారిని తాము విచారించాల్సిన అవసరముందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మే 18న నోటీసు జారీ చేసినందున లింగమనేని రమేష్‌కు కేసు దస్త్రాలు ఇవ్వాలని సీఐడీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా పడింది. అటాచ్ మెంట్ వ్యవహారంలో విచారణ జరిపే అధికారి ఏసీబీ కోర్టుకు ఉందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.