చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

నవతెలంగాణ – హైదరాబాద్: రాయదుర్గం పల్లె ప్రగతి కోసం ప్రజావేదికలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఆరాచక పాలన దించడానికి ఇంటికి ఒకరు ముందుకు రావాలి అన్నారు. ఒకటి రెండు రోజుల్లో నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నా పైనా దాడులు చేస్తారు. నా పైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రతిపక్షాలు బయటకు రాకుండా చేస్తున్నారు. ఎక్కువగా మాట్లాడితే రౌడీలతో దాడులు చేయిస్తున్నాడు. టిడిపిలో హయంలో వివేకాను హత్య చేసి..  రక్త చరిత్ర అని రాశారు. పింక్ డ్తెమండ్ సిబిఎన్ ఇంట్లో ఉందని ప్రచారం చేశారు. పుంగనూరు , తంబాలపల్లిలో 400 మందిపై కేసులు పెట్టారు. పుంగనూరు అలర్లలో నేను చెప్పానని చల్లాబాబును సంతకం పెట్టమన్నారు. కుప్పంకు వెళ్లి నా టిక్కెట్ నేనే ప్రకటించుకోవాలా.? అని ప్రశ్నించారు. మాకు అన్యాయం జరిగిందని ఏ ఉద్యోగం సంఘం అయినా బయటకు వచ్చి పోరాడుతోందా అని ప్రశ్నించారు.

Spread the love